విదేశీ పక్షుల సంతానోత్పత్తి కాలమిది. అందులో భాగంగానే రివర్ టెర్న్ పక్షులు హైదరాబాద్ శివార్లలోని గండిపేట జలాశయానికి వలసవచ్చాయి. సంతానాన్ని వృద్ధి చేసుకున్నాయి. అందులో ఒక పక్షి పిల్ల మంగళవారం ఒడ్డునే చిన్న చేపల కోసం వెదుకుతూ బురదలో కూరుకుపోయింది.

ఇదే అదునుగా గద్ద ఒకటి దాన్ని ఎత్తుకెళ్లేందుకు రాగా, ఆ జాతి పక్షులన్నీ ఆ ప్రయత్నాన్ని కలిసికట్టుగా అడ్డుకున్నాయి. వాటి పరిమాణం, శక్తి తక్కువే అయినప్పటికీ మూకుమ్మడిగా గద్దపై దాడిచేసి, అక్కణ్నుంచి దూరంగా తరిమేశాయి. ‘ఐకమత్యమే మహా బలం’ అని నిరూపించాయి.

ఇదీ చదవండిః దిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..