ETV Bharat / state

డిగ్రీలో భారీగా మిగిలిన సీట్లు - online

డిగ్రీలో సీట్లు భారీగా మిగిలాయి. విద్యార్థులు ఇంజినీరింగ్​, ఫార్మా ఇతర కోర్సుల వైపు మొగ్గుచూపడం వల్ల 2 లక్షల 22 వేల 704 సీట్లు మిగిలిపోయాయి. దోస్త్​ మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇవాళ సీట్లు కేటాయించారు.

విద్యార్థులు
author img

By

Published : Jun 30, 2019, 12:07 AM IST

డిగ్రీలో భారీగా మిగిలిన సీట్లు

డిగ్రీలో 2 లక్షల 44 వేల 704 సీట్లు మిగిలిపోయాయి. దోస్త్ మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇవాళ సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో 3 లక్షల 86 వేల 204 సీట్లకు దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపట్టారు. మొత్తం మూడు విడతల్లో కలిపి లక్ష 70వేల 900 మంది విద్యార్థులు దోస్త్​లో వివరాలు నమోదు చేసుకున్నారు. రెండు విడతల్లో 99 వేల 35 మంది విద్యార్థులకు సీట్లు ఖరారు చేశారు. ఇవాళ మూడో విడతలో 42 వేల 468 మందికి సీట్లు కేటాయించారు. అందులో కొత్తగా సీట్లు పొందిన వారు 36 వేల 910 మంది కాగా.. మరో 5 వేల 558 మంది గతంలో ఉన్న సీటును మార్చుకున్నవారు.

ప్రత్యేక విడత ప్రవేశాలు

మూడో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జులై 4వరకు ఆన్​లైన్​లో కాలేజీలకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. జులై 1న తరగతులు ప్రారంభం కానున్నాయి. కాలేజీ మార్చుకునే విద్యార్థుల కోసం జులై 5 నుంచి జులై 7 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించి జులై 10న సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల తర్వాత ప్రత్యేక విడత ప్రవేశాలు చేపట్టాలని దోస్త్ అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 15-20 శాతం పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.