అమెరికాలో హైదరాబాద్కి చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో చదువుతున్న 19ఏళ్ల రూత్జార్జ్ అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఇల్లినాయిస్ పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే...
ఈనెల 23న క్యాంపస్ పార్కింగ్ వద్ద యూనివర్సిటీ పోలీసులు రూత్ మృతదేహాన్ని గుర్తించారు. క్యాంపస్ సమీపంలో నివాసం ఉండే డొనాల్డ్ తుర్మాన్ 22వ తేదీన ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడు తుర్మాన్ గతంలో దొంగతనం కేసులో ఆరేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. హత్య తర్వాత ఆమె చేతిలోని ఐఫోన్ లాక్కొని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన చికాగో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన రూత్ తల్లిదండ్రులు 20ఏళ్ల క్రితమే చికాగోలో స్థిరపడ్డారు.
ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!