ETV Bharat / state

గొలుసు దొంగలు 12 గంటల్లోనే అరెస్ట్​ - hydarabad cp

పట్టపగలు నడిరోడ్డుపై మహిళ మెడలో బంగారు ఆభరణాలు అపహరించిన నిందుతులను అంబర్​పేట్​ తూర్పుమండల పోలీసులు 12 గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగు తులాల బంగారం గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

గొలుసు దొంగలు 12 గంటల్లోనే అరెస్ట్​
author img

By

Published : Jul 28, 2019, 8:47 PM IST

హైదరాబాద్ అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో శనివారం జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు 12 గంటల్లోపే చేధించారు. శనివారం ఉదయం అనసూయ అనే మహిళ స్థానికంగా ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో గొలుసును లాక్కెళ్లారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లోనే చేధించి నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల నుంచి నాలుగు తులాల గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌ కీలకంగా మారిందని సీపీ తెలిపారు. పట్టుబడిన ఇద్దరూ యువకులేనని పేర్కొన్నారు. నిందితులు హర్ష జోషి, మనోజ్ కుమార్, అశ్విన్ సింగ్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని సీపీ వివరించారు. వ్యసనాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడి భవిష్యత్​ నాశనం చేసుకుంటున్నారని సీపీ హెచ్చరించారు.

గొలుసు దొంగలు 12 గంటల్లోనే అరెస్ట్​

ఇదీ చూడండి: ఉజ్జయిని మహంకాళి బోనాల్లో దొంగల చేతివాటం

Intro:TG_WGL_12_28_MAHANKAALI_AMMAVAARI_VUREGINPU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ విష్ణుపురి లోని శివశక్తి మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం నగర వీధులలో అమ్మవారి ప్రతిమను ఊరేగించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపు సందడిగా మారింది. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ వేడుకలో చిన్న పెద్ద అందరూ పాల్గొని ఆనందంగా చిందులు వేశారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాజిపేట్ నగర పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.