ETV Bharat / state

'హక్కుల రక్షణకు ఆర్వోఆర్‌ చట్టం అడ్డు కాదు' - హైకోర్టు లెటెస్ట్​ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్వోఆర్‌ చట్టం హక్కుల రక్షణకు అడ్డంకి కాదని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. భూమిపై హక్కులకు సంబంధించి రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు, ప్రభుత్వంపై సూట్‌ వేయడానికి మాత్రం వీల్లేదంది.

The new ror act is not an obstacle to the protection of rights highcourt
'హక్కుల రక్షణకు ఆర్వోఆర్‌ చట్టం అడ్డు కాదు'
author img

By

Published : Feb 17, 2021, 6:51 AM IST

భూమిపై హక్కుల కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్వోఆర్‌ చట్టం అడ్డంకి కాదంటూ మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. భూమిపై హక్కులకు సంబంధించి రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు, ప్రభుత్వంపై సూట్‌ వేయడానికి మాత్రం వీల్లేదంది. అధికారులు నమోదు చేసిన తప్పును సరిదిద్దాలని కోరవచ్చని, ఈ హక్కును పొందడానికి కొత్త చట్టంలోని నిబంధన ఎలాంటి నిషేధం విధించడంలేదని పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల (ఆర్వోఆర్‌)చట్టం-2020లోని సెక్షన్‌ 9ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దాన్ని సవరించేలా ఆదేశించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణ్‌పూర్‌ మండలానికి చెందిన శ్రీపతి జయమ్మ జయప్రద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నారాయణ్‌పూర్‌ మండలం గుజ్జ గ్రామ పరిధిలోని 1.17 ఎకరాల భూమికి సంబంధించి రికార్డుల్లోంచి తన పేరును తొలగిస్తూ తహసిల్దార్‌ ప్రొసీడింగ్స్‌ జారీచేశారన్నారు.

దీనిపై కోర్టును ఆశ్రయించడానికి కొత్త ఆర్వోఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 9 నిషేధం విధిస్తోందన్నారు. వివాద పరిష్కారానికి చట్టం ప్రత్యామ్నాయమేదీ చూపలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సివిల్‌ కోర్టుకు వెళ్లడానికి ఎవరు అడ్డగించారని ప్రశ్నించింది. కొత్త చట్టం ప్రకారం విధులు నిర్వహించిన అధికారులపై కోర్టును ఆశ్రయించరాదంది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీపీసీ)లో హక్కులకు రక్షణ ఉందని పేర్కొంది. అధికారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడానికి వీల్లేకున్నా అధికారుల చర్యను సవాలు చేయవచ్చంది. రికార్డుల్లో పద్దుల తొలగింపుపై మాత్రమే సింగిల్‌ జడ్జిని ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి వద్దకు బదిలీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: జోరందుకున్న 'మండలి' సన్నాహక సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.