ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల పిలుపు మేరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. కర్ఫ్యూలో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇళ్లనుంచి ఎవరు రోడ్ల మీదికి రావొద్దని.. స్వీయ క్రమశిక్షణ తో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మూగబోయిన హైదరాబాద్ మహానగరం