ETV Bharat / state

ఎన్ని ఆసుపత్రులు తిరిగినా దొరకని బెడ్లు.. చివరకు చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్​ మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందగా.. అతడికి కొవిడ్‌ నిర్ధారణ అయిన సమాచారం కూడా జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ వద్ద లేదు. అతడికి చికిత్స అందించిన ఆసుపత్రి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. చివరకు మృతిచెందిన తర్వాత అంత్యక్రియల కోసం అధికార వర్గాలను సంప్రదించింది.

The man was unable to find beds at the hospital was dead
జ్వరంతో తిరిగినా దొరకని బెడ్లు.. చివరకు చికిత్స పొందుతూ మృతి
author img

By

Published : Jul 7, 2020, 9:32 AM IST

కాప్రా సర్కిల్‌ మల్లాపూర్‌ డివిజన్‌ గ్రీన్‌హిల్స్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి జూన్‌ 24 నుంచి జ్వరం వస్తుండటంతో దమ్మాయిగూడ, ఈసీఐఎల్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినప్పటికీ తగ్గలేదు. ఫలితంగా 27న ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. నాలుగు గంటల పాటు ఉంచుకుని బెడ్లు ఖాళీ లేవని పంపించేశారు. అదేరోజు సికింద్రాబాద్‌లోని మరో నాలుగు ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లగా మా దగ్గర బెడ్లు ఖాళీగా లేవనే సమాధానమే వచ్చింది. చివరకు ఐదో రోజు జులై 1న నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించారు. కానీ పాజిటివ్‌ వచ్చిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పకపోగా.. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లోనూ లేదు.

నిలదీస్తే.. కరోనా అన్నారు..!

ఐదు రోజులుగా షుగర్‌, బీపీ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యచికిత్స అందిస్తున్నామని వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులకు తొలుత సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటంబ సభ్యులకు మృతదేహాన్ని చూసేందుకు అనుమతి ఇవ్వకపోగా.. స్థానిక పోలీసులు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని తీసుకురావాలని సూచించారు. అనుమానం వచ్చిన కుటంబ సభ్యులు అసలు ఏమైందని సెక్యూరిటీ సిబ్బందిని నిలదీస్తే కరోనాతో మృతి చెందాడని సమాధానం ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులకే మృతదేహం అప్పగిస్తామని చెప్పారు. బిల్లు లెక్కలు తేలకపోవడంతో సోమవారం రాత్రి వరకూ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించలేదు.

కదలని యంత్రాంగం..!

బాధితుడి కుటుంబ సభ్యులు సోమవారం కాప్రా సర్కిల్‌ అధికారులకు స్థానికంగా ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుపుకోవడానికి అనుమతి కావాలని కోరారు. అప్పటి వరకు సర్కిల్‌ అధికారులకు, స్థానికంగా ఉన్న వైద్యాధికారులకు గానీ మరణంపై ఎలాంటి సమాచారం లేదు. ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చి మరణించాడన్న విషయం ఇటు జీహెచ్‌ఎంసీకి గాని, అటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయకపోవడంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా పరీక్షలు నిర్ధారణ చేసిన ల్యాబ్‌ ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతోనే తమకు సమాచారం లేదని వైద్యాధికారులు చెప్పుకొచ్చారు. కొవిడ్‌తో మృతి చెందాడని జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిసినా మృతుడి నివాసం ఉండే ప్రాంతాన్ని శానిటైజ్‌ చేయడం గాని వైద్యబృందం సందర్శించడం గానీ చేయలేదు. కనీసం కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం కూడా ఆరా తీసే ప్రయత్నం చేయకపోవడంపై స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారు చెప్తేనే తెలిసింది..

గ్రీన్‌హిల్స్‌ కాలనీకి చెందిన వ్యక్తి కొవిడ్‌ పరీక్ష ఫలితాలు మాకు అందజేయలేదని కాప్రా సర్కిల్​ ఏఎంహెచ్​వో మైత్రేయి పేర్కొన్నారు. మృతికి సంబంధించిన వివరాలు ఆసుపత్రి వర్గాలు మాకు చెప్పలేదన్నారు. కుటుంబ సభ్యులు చెప్పినప్పుడే తెలిసిందని తెలిపారు.

ఇదీచూడండి: కరోనాతో కుదేలైన విద్యా వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.