మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఈనెల 28న ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఏర్పాటు కోసం అనువైన స్థలాలను పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కేశవరావు, ఎమ్మెల్సీ వాణీదేవి, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పరిశీలించారు.
పీవీ నరసింహారావు మార్గ్‌గా పేరు మార్చిన నెక్లెస్ రోడ్‌ను సందర్శించారు. అనంతరం విగ్రహ ఏర్పాటు కోసం వివిధ స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కేశవరావు తెలిపారు.
ఇదీ చదవండి: covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు