రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ రైలు విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. ఇవాళ 100వ రైలు లోడింగ్ అయింది. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే వందో రైలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.
ఉల్లిపాయల లోడ్‌తో ఉన్న రైలు మహారాష్ట్రలోని నాగర్సోల్ నుంచి పశ్చిమ బంగాకు నేడు రవాణా అయ్యింది. ఇప్పటి వరకు కిసాన్ రైళ్ల ద్వారా సుమారు 34,063 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు.