కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో చెప్పాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కోరింది. వైరస్ వ్యాప్తిపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలను ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య సుమోటోగా తీసుకున్నారు. కరోనా సోకిన రోగికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో తెలపాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలతో ఈ నెల 19వ తేదీలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఈనెల 7న మానవ హక్కుల కమిషన్లో నిర్వహించే సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్యాధికారులు హాజరుకావాలని హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్