ETV Bharat / state

'రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు కారణాలు ఉన్నాయా?' - దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజా వార్తలు

హైకోర్టులో వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై విచారణ జరిగింది. బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని రైల్వేశాఖను ధర్మాసనం ప్రశ్నించింది. బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

The High Court is hearing on Evacuation of migrant laborers
రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు కారణాలు ఉన్నాయా?
author img

By

Published : Jun 22, 2020, 5:58 PM IST

వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌ వెళ్లేందుకు 45 మంది ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్ పేర్కొన్నారు. బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని రైల్వేశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ప్యాసింజర్ రైలుకు 24 బోగీలే ఉంటాయని అదనంగా ఏర్పాటు చేయరాదని రైల్వే శాఖ వెల్లడించింది.

బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు కారణాలు ఉన్నాయా అని అడిగింది. పెళ్లిళ్లకు ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే... వలసకూలీలకు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.

అదనపు బోగీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని హైకోర్టుకు రైల్వేశాఖ తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే రైల్వేను తానే కోరతానని సీజే జస్టిస్ చౌహాన్ స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రేపు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చూడండి: శత్రువులు చుట్టుముట్టినా... సింహంలా గర్జించాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.