స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం.. రెరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నిబంధనలను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల్లో 2017కు ముందు ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చిందని.. దానివల్ల చట్టం ప్రయోజనాలు నెరవేరవని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ