కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేశ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. రెండు వారాల సమయం కావాలని సీఎస్ హైకోర్టును కోరారు. స్పందించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు13కి వాయిదా వేసింది. ఆగస్టు13న సీఎస్, ఇతర అధికారులు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'