దిల్సుఖ్నగర్లోని బృందావన్ లాడ్జీలో ప్రేమోన్మాది దాడికి గురై గాయపడిన యువతి అత్యవసర చికిత్స విభాగంలో ఉంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. నిందితుడు వెంకటేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రికి వచ్చిన నిందితుడి తల్లిదండ్రుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వేంకటేశ్కు స్నేహితులు తక్కువేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం వెంకటేశ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందున అతని నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు.
ఇదీ చూడండి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుప్రమాదం