ETV Bharat / state

యువత చదువుతో పాటు వారి చరిత్ర తెలుసుకోవాలి: తమిళి సై - గవర్నర్ తాజా వార్తలు

Governor Tamilisai: యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు.

గవర్నర్
గవర్నర్
author img

By

Published : Aug 8, 2022, 8:18 PM IST

Governor Tamilisai: యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఛాయచిత్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు.

సుమారు 38 మంది స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను ఈ ప్రదర్శనలో సంక్షిప్త వివరాలతో ఏర్పాటు చేసిన ఫొటోలను గవర్నర్ పరిశీలించారు. జాతీయ జెండా రూపకల్పనలో కృషి చేసిన సిస్టర్ నివేదిత, డాక్టర్ అనిబిసెంట్, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. సాలార్ జంగ్ మ్యూజియంను సందర్శించే వారిలో ఈ ప్రదర్శన దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. గతంలో ఏడాదిలో ఒక్కరోజే జెండా పండుగ వచ్చేదని.. ఇప్పుడు ఏడాదంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే అదృష్టం కలిగిందంటూ తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ, స్టార్ షెట్లర్ పీవీ సింధు ఛాయాచిత్రాలు కూడా ప్రదర్శించడం విశేషం.

ఇవీ చదవండి: 'అవమానాలు భరిస్తూ ఉండలేను.. కాంగ్రెస్​కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..'

యువకుడ్ని పొట్టనపెట్టుకున్న మొసలి.. రెండు గంటల పాటు చెలగాటం ఆడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.