ETV Bharat / state

ఉద్యోగులకు రోటేషన్​ విధానం అమలు

రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రొటేషన్​ విధానంలో విధులకు హాజరయ్యేలా సర్కారు వెసులుబాటు కల్పింది. విధులకు రాని ఉద్యోగులు కార్యాలయాల హెచ్​క్వార్టర్స్​లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

The government has ordered employees to attend the rotation process for their duties
ఉద్యోగులకు రోటేషన్​ విధానం అమలు
author img

By

Published : Mar 23, 2020, 10:34 PM IST

కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రొటేషన్ విధానంలో విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది. అత్యవసర సేవలు ఉండే శాఖలు, కార్యాలయాలు మినహా మిగతా చోట్ల రొటేషన్ విధానంలో 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారుల వరకు దీన్ని అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. అయితే ఈ సమయంలో కార్యాలయాలకు రాని ఉద్యోగులు హెడ్​క్వార్టర్స్​లోోనే అందుబాటులో ఉండాలని, ఎలక్ట్రానిక్, సమాచార వ్యవస్థతో ఎల్లప్పడూ అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఇదీ చదంవండి:'ఎయిర్ ​ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.