ETV Bharat / state

ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలే లక్ష్యం : లింగయ్య యాదవ్​ - అంబేడ్కర్​కు నివాళులర్పించిన రాజ్యసభసభ్యుడు లింగయ్య యాదవ్

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ట్యాంక్​బండ్ వద్ద విగ్రహానికి తెరాస రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్​ నివాళులర్పించారు. రాష్ట్రప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.

the-goal-is-to-provide-constitutional-fruits-for-everyone-says-mp-lingaiah-yadav
ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యం : లింగయ్య యాదవ్​
author img

By

Published : Dec 6, 2020, 9:39 PM IST

డాక్టర్​ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెరాస రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్​బండ్​ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.

బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అంబేడ్కర్​ అని కొనియాడారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షనేతలు జూలకంటి రంగారెడ్డి, ఈటీ నరసింహ, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.