బంగారంలో పెట్టుబడుల పేరుతో వేల కోట్ల రూపాయలు స్వీకరించి నౌహీరా షేక్ మదుపరులను మోసం చేశారు. ఆమె వ్యాపారంలో డైరెక్టర్లు మొదటినుంచి సహకరించినట్లుగా సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా నగదును ఇతర సంస్థలకు బదిలీ చేయడం, పెట్టుబడులు స్వీకరించడంలో డైరెక్టర్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నౌహీరా షేక్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని డైరెక్టర్లుగా వ్యవహరించిన ఇస్మాయిల్ షేక్, అష్రఫ్ మహ్మద్, షేక్ అబూబకర్, అబ్దుల్ ఖయ్యూం, యాసిన్ బేగ్ పరారయ్యారు. తిరుపతి, బెంగళూర్, ఉత్తరప్రదేశ్లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారిస్తే నౌహీరా షేక్ అక్రమాలు మరిన్ని బయటపడతాయని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆ మాయావృక్షం ఎదుట సురీడూ చిన్నబోవాల్సిందే!