హైదరాబాద్ బయోడైవర్సిటీ కూడలిలో నిర్మించిన మెదటి లేవల్ పైవంతనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ , ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు గల పైవంతెనను....30 కోట్ల 26లక్షల వ్యయంతో నిర్మించారు.
ప్రస్తుతానికి ఫ్లైఓవర్ పై ఒకే వైపు వాహనాలకు అనుమతించనున్నట్లు తెలిపిన మేయర్ బొంతు రామ్మోహన్ ఈ మార్గం ద్వారా గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని పేర్కొన్నారు
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు