దక్షిణ మధ్య రైల్వేలోని ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సమక్షంలో కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్ అందజేశారు. వైద్యులు, నర్సులు, హౌస్‌కీపింగ్ సిబ్బంది మహమ్మారి సమయంలో తమ జీవితాలను పనంగా పెట్టి... ఎంతో శ్రమతో, సేవా దృక్పథంతో నిరంతర సేవలను అందించారని జీఎం కొనియాడారు.
దేశ వ్యాప్తంగా మొదటగా ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయం ప్రకారం జోన్‌లోని వైద్య సిబ్బంది అంకిత సేవకు గుర్తుగా మొదటగా కొవిడ్-19 వ్యాక్సిన్ వారికి ఇచ్చామని గజానన్ మాల్య అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్