దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మృతుల కుటుంబసభ్యులు దిశ విచారణ కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చెన్న కేశవులు తండ్రి రోడ్డు ప్రమాదం కేసులో తమకు అనుమానాలున్నాయని న్యాయవాది రజనీ ఆరోపిస్తున్నారు. కేసును వెనక్కి తీసుకుంటే రూ.25 లక్షలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని అన్నారు. దిశ హత్య కేసులో కీలకమైన విషయాలు బయట పెడతామని న్యాయవాది తెలిపారు.
చెన్న కేశవులు తండ్రి కూర్మయ్యను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది. లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్కౌంటర్, కూర్మయ్య రోడ్డు ప్రమాదం కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపాలని విచారణ కమిషన్‌ను ఆశ్రయించారు.