తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావుకు రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి బాహ్యవలయ రహదారిపై నుంచి ఇంటికి వెళ్తుండగా ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది. వర్షం కురవడం వల్ల కారు... ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని.. స్వల్పంగా గాయపడినట్టు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి : 60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన