నిత్యం నేరాల నియంత్రణలో తలామునకలయ్యే పోలీసులు క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందుతున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. జింఖానా మైదానంలో నిన్న మొదటి మ్యాచ్ జరగగా.. నేడు ఏవోసీ మైదానంలో రెండో రోజు మ్యాచ్ జరిగింది.
నిన్న జరిగిన మ్యాచ్లో చిలకలగూడ పోలీసు జట్టు విజయం సాధించగా.. నేడు బోయిన్ పల్లి జట్టు గెలుపొందింది. ఈరోజు ఉదయం జరిగిన మ్యాచ్లో తుకారం గేట్ జట్టుపై 70 పరుగుల తేడాతో బోయిన్ పల్లి జట్టు విజేతగా నిలిచింది. బోయిన్పల్లి జట్టులో ఎస్సై నవీన్ సెంచరీతో అదరగొట్టారు. ఈ టోర్నీలో 14 జట్లు పాల్గొంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు ఏప్రిల్ 10 వరకు మ్యాచ్లు జరగనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ప్రతీ గింజను కొంటాం: ఈటల