పోరాటాలతో నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ కోదండరామ్‌లను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచినట్లు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సెక్రటేరియట్ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. విద్యావంతులైన పట్టభద్రులు వారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాని కోరారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని మాక్స్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టి 100 రోజులు గడిచినాా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వెంకట్రామయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు పోకడలు అవలంబిస్తూ.. ప్రజాస్వామికవాదులు ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆ ప్రయత్నాలను పోరాట స్ఫూర్తితో అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాన్ని మొదట వ్యతిరేకించిన కేసీఆర్ దిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ కోదండరామ్‌లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 19వ అంతస్తు నుంచి పోలీసులకు మహిళ ఫోన్