క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. తోటి స్నేహితుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయటం వల్ల 13 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాదకర ఘటన విశాఖలో చోటుచేసుకుంది. నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన విజయ్(13) అతని స్నేహితుడు(14) ఆదివారం క్రికెట్ ఆడుతుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే విజయ్ రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్‌లో విజయానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని ఓర్చుకోలేని తోటి బాలుడు కోపంతో విజయ్‌పై దాడి చేశాడు. క్రికెట్ బ్యాట్‌తో పొట్టలో పొడిచాడు. లోపలి పేగుల్లో రక్తప్రసరణ నిలిచిపోయి విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని.. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కొత్త సచివాలయ నమూనాకు త్వరలోనే తుదిరూపు