ETV Bharat / state

రైల్వే క్రాసింగ్​ గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణం వేగవంతం

రైల్వే క్రాసింగ్​ గేట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా దక్షిమ మధ్య రైల్వే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రహదారి ప్రయాణికుల భద్రత కోసం వాటి స్థానాల్లో రైల్వే అండర్​ బ్రిడ్జ్​, సబ్​వేలు (ఎల్​హెచ్​ఎస్​), రోడ్​ ఓవర్​ బ్రిడ్జ్​ నిర్మాణాలు చేపట్టింది. హైదరాబాద్ డివిజన్​లో రూ.30.8 కోట్ల వ్యయంతో రికార్డు స్థాయిలో 11 చోట్ల నిర్మాణాలు పూర్తి చేసింది.

the construction of bridges in place of railway crossing gates in south central railway hyderabad division
రైల్వే క్రాసింగ్​ గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణం వేగవంతం
author img

By

Published : Jan 20, 2021, 4:34 PM IST

రోడ్డు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రైల్వే అండర్​ బ్రిడ్జ్​, సబ్​వేలు, రోడ్​ ఓవర్​ బ్రిడ్జ్​ల​ నిర్మాణాలను దక్షిణ మధ్య రైల్వే వేగవంతం చేసింది. రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల స్థానాల్లో వీటి నిర్మాణ పనులు చేపట్టింది. హైదరాబాద్ డివిజన్​లో మే-డిసెంబర్ మధ్య కాలంలో రూ.30.8 కోట్ల వ్యయంతో రికార్డ్ స్థాయిలో 11 నిర్మాణాలను పూర్తిచేసింది.

రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు విధానంలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తూ దశల వారీగా బ్రిడ్జ్​లు, సబ్​వేల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటి నిర్మాణాల్లో సాంకేతిక పద్ధతులను అవలంభిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైల్వే ఇంజనీర్ల పద్దతిని అనుసరించి సబ్​వేల నిర్మాణానికి అనువుగా ముందే తయారుచేసిన రీఇన్​ఫోర్స్​డ్​ కాంక్రీట్ సిమెంట్ (ఆర్​సీసీ) బాక్సులను సంబంధిత ప్రాంతాలకు తరలించారు. ఈ విధంగా తక్కువ సమయంలోనే రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి పునరుద్ధరించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇదీ చూడండి : కేటీఆర్​ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.