Congress Committee on cancellation of GO 111 in TS : రాష్ట్రంలో జీఓ 111ను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏడుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచనతో కమిటీ ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కోదండ రెడ్డి చైర్మన్‌గా రామ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్, ఆర్థికవేత్త లుబ్న శర్వాట్, డాక్టర్ జస్వీన్ జైరథ్ తదితరులు సభ్యులతో కమిటీ వేసినట్లు వివరించారు. అంతకు ముందు చైర్మన్ కోదండ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్లో సమావేశం జరిగింది. 111 జిఓను ప్రభుత్వం ఎత్తి వేయడం వల్ల జంట జలాశయాలకు జరిగే నష్టం.. తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని కోదండరెడ్డి తెలిపారు. పర్యావరణ వేత్తలతో పాటు అన్ని వర్గాలతో సమావేశమై లోతుగా అధ్యయనం చేసి నివేదిక అందజేస్తామన్నారు.
"రాష్ట్రంలో బాధ్యత గల పార్టీగా ఉన్న కాంగ్రెస్ జీఓ 111ను రద్దు విషయంలో నిజ నిర్దారణ కమిటి గురువారం వేశారు. ఈ కమిటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకృతి, చెరువులు, పర్యావరణం తదితర విషయంలో పోరాటం చేస్తున్న ప్రముఖ వ్యక్తులను నియమించారు. వారు క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించి నివేదికను రూపొందిస్తాం. అనంతరం మేము ఇచ్చే రిపోర్ట్‌లో సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాం."- కోదండ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
జీఓ 111 రద్దు విషయంలో రేవంత్ రెడ్డి స్పందన : జోఓ 111పై రద్దు విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 1996లో ఆనాటి ప్రభుత్వం ఈ జీఓను తీసుకువచ్చిందని తెలిపారు. 84 గ్రామాలను బయోకన్సర్వేషన్ జోన్లో పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధన దాహం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ నగర్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీఓ వెనక పెద్ద కుంభకోణం దాగి ఉందని ధ్వజమెత్తారు. మొత్తం భూములన్ని కొన్న తరవాత.. ఇప్పుడు ఈ జీఓను రద్దు చేశారని ఆరోపించారు.
జీవో ఎందుకు రద్దు చేశారంటే.. : జీఓ 111 ఉత్తర్వులు వల్ల పరిధిలో ఉన్న ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ఆ ప్రాంత వాసులు ప్రభుత్వానికి కొన్ని సంవత్సరాలుగా విజ్ఞాప్తి చేస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావించారు. దీంతో ఈ జోఓను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీన ఈ జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చదవండి: