ETV Bharat / state

ధర్మాసనానికి క్షమాపణ చెప్పిన గద్వాల కలెక్టర్​

హైకోర్టు ఆదేశాలు అమలు చేయనందున గద్వాల జిల్లా పాలనాధికారి శశాంక్​ ఉన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. శశాంక్​పై శిక్షను 3 నెలల పాటు నిలిపివేస్తూ... ధర్మాసనం ఉత్తర్యులు జారీ చేసింది.

ధర్మాసనానికి క్షమాపణ చెప్పిన గద్వాల కలెక్టర్​
author img

By

Published : Jul 6, 2019, 5:21 AM IST

Updated : Jul 6, 2019, 7:34 AM IST

కోర్డు ఆదేశాలు అమలు చేయనందున గద్వాల కలెక్టర్​ శశాంక్​ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. 3 నెలల్లో ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తానని హామినిచ్చారు.

ధర్మాసనానికి క్షమాపణ చెప్పిన గద్వాల కలెక్టర్​

అసలేం జరిగిందంటే...

శశాంక్​ కరీంనగర్​ మున్సిపల్​ కమిషనర్​గా ఉన్నప్పుడు నగరంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ విస్తరణలో భాగంగా కూల్చేసిన దుకాణాదారులకు పరిహారం లేదా దుకాణాలు కేటాయించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేయలేదని శశాంక్​పై కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్​ జడ్జి శశాంక్​కు నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధించారు. సింగిల్​ జడ్జి తీర్పుపై అప్పీల్​ దాఖలు చేసిన శశాంక్​... విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు క్షమాపణ కోరి​... 3 నెలల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. దీన్ని పరిగణంలోకి తీసుకున్న ధర్మాసనం... శశాంక్​పై శిక్షను 3 నెలల పాటు నిలిపేస్తూ ఉత్తర్యులు జారీ చేసింది.

ఇదీ చూడండి: హరేన్​ పాండ్య హత్యకేసులో 12 మందికి శిక్ష

Last Updated : Jul 6, 2019, 7:34 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.