హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్లగా ఉందని వారు అన్నారు. వలస కార్మికులు 40 కోట్ల మంది ఉంటే కేంద్ర ప్రభుత్వ దృష్టిలో 20 కోట్ల మంది ఉన్నట్లు తెలిపారని భట్టి దుయ్య బట్టారు. వారిని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మద్యం అమ్మకాలపై మాత్రమే ఫోకస్ పెట్టిందన్నారు.
రోజుకు రూ. 6 నుంచి 7 రూపాయలు
కేంద్రం వలస కూలీలకు ప్రకటించిన రూ. 3500 కోట్ల ప్యాకేజీ వారి లెక్కల ప్రకారం 20 కోట్ల మందికి పంచితే రోజుకు రూ. 6 నుంచి 7 రూపాయలు మాత్రమే వస్తుందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఏ లెక్కన వారు ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సమయంలో గనులు, అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణను పెంచడం సమజసం కాదన్నారు. రెండు నెలలుగా ప్రజల జీవనోపాధి దెబ్బతిందన్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి తెలిపారు. వలస కార్మికులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన మాజీ ఎంపీ వి. హనుమంతరావును అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.
ఇదీ చూడండి : కేంద్రం ప్యాకేజీలో అన్ని దీర్ఘకాలిక సాయాలే..