ETV Bharat / state

ఆహార భద్రత కింద రాష్ట్రానికి రూ.17,479 కోట్లు

జాతీయ ఆహార భద్రత పథకం కింద తెలంగాణకు 2016-17 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 14 వరకూ రూ.17,479.31 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి దన్వేరావ్‌ సాహెబ్‌ దాదారావ్‌ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

The central government has released Rs 17,479 crore to Telangana for food security
ఆహార భద్రత కింద రాష్ట్రానికి రూ.17,479 కోట్లు
author img

By

Published : Sep 21, 2020, 8:15 AM IST

* తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.18.50 కోట్లతో ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(టీఎస్‌సీఈఎల్‌డీ) ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యాన్‌ తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

* రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ పనులు 2020 ఆగస్టు నాటికి 99.70 శాతం పూర్తయినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు. తెలంగాణకు 5 జీవ రసాయన/జీవ ఎరువుల యూనిట్లను మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌ తెలిపారు. మానవ హక్కుల కార్యకర్తలపై వేధింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 2017 నుంచి 2021 వరకు 7 కేసులు, తెలంగాణలో 8 కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

కొవిడ్‌ యోధులకు 10% అధిక వేతనాలు ఇచ్చాం: నామా

కరోనా యోధులైన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం 10 శాతం వేతనాలు అధికంగా ఇచ్చిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. లోక్‌సభలో కరోనాపై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మూతపడిన పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి తాత్కాలిక కార్మికులను ఆదుకున్నామన్నారు. దుకాణాలు, ఇళ్ల అద్దెలను బలవంతంగా వసూలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని తెలిపారు. నిరుద్యోగులను ఆదుకునే విషయంలో కేంద్రం దృష్టిపెట్టాలని నామా కోరారు. లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులు ఇబ్బంది పడ్డారని, తెలంగాణ ప్రభుత్వం వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించిందని చెప్పారు. రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున జీఎస్టీ పరిహారం వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఇదీ చూడండి: 'పల్లె, పట్టణ ప్రగతి అమలులో రెండో స్థానంలో నిజామాబాద్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.