విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారి కోసం కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా ఏడు రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లోనూ, తర్వాత మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసిన క్వారైంటైన్ నూతన మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలిఫోన్ ద్వారా మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థన మేరకు మార్పులు చేసినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
విదేశాల నుంచి వచ్చే వారిలో గర్భిణీలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవార, కుటుంబ సభ్యులు మరణించిన వారు వస్తే... వారిని నేరుగా హోం క్వారంటైన్‌కు తరలించవచ్చని తెలిపింది. వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు, వాయు మార్గాల ద్వారా వచ్చిన వారికి వైరస్ లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తారు. లక్షణాలు లేకపోతే నేరుగా ఇంటికి పంపి స్వీయ రక్షణ పాటించాలని సూచించారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను అమలు చేయాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. హోం క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరినీ పరిశీలనలో ఉంచాలని... లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తరలించాలని తెలిపారు.
ఇదీ చూడండి: గొర్రెకుంట బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ