ETV Bharat / state

Telangana Loans News : రూ.35వేల కోట్ల రుణాలకు కేంద్రం కోత

Telangana Loans News : ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో ప్రభుత్వం తీసుకునే రుణాల్లో కేంద్రప్రభుత్వం కోత విధించింది. ఏడాదికి రూ.8,814 కోట్ల మేర తగ్గించింది. దీంతో రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో తీసుకునే అప్పుల్లో ప్రతి ఏటా రూ.8,814 కోట్లు కోత పడనుంది.

central govt on Telangana Loans
central govt on Telangana Loans
author img

By

Published : Sep 6, 2022, 7:06 AM IST

Telangana Loans News : ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలోకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల్లో ఏడాదికి రూ.8,814 కోట్ల మేర అంటే మొత్తం రూ.35 వేల కోట్లు కోత పడనుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న బడ్జెట్​ ఏతర రుణాల మొత్తాన్ని ఎఫ్​ఆర్​బీఎమ్ కిందే పరిగణించి నాలుగేళ్ల పాటు కేంద్రం కోత విధించింది. బడ్జెట్​లో పేర్కొన్న అప్పులు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం.. గడిచిన రెండేళ్లలో ఆ తరహాలో తీసుకున్న రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలోనే పరిగణిస్తామని మొదట తెలిపింది. అలా చేస్తే ప్రస్తుత ఏడాది రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Telangana Loans Latest News : పలు దఫాలుగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 2021-22లో బడ్జెట్ వెలుపల తీసుకున్న అప్పుల మొత్తాన్ని నాలుగేళ్ల పాటు ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో భాగంగా పరిగణించేందుకు అంగీకరించింది. దీంతో గతేడాది తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు (2025-26) వరకు సర్దుబాటు చేసింది.

ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో ప్రభుత్వం తీసుకునే రుణాల్లో ఆ నాలుగేళ్ల పాటు రూ.8,814 కోట్ల చొప్పున కోత విధించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా.. రూ.53,970 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకోవాలని ప్రభుత్వం బడ్జెట్​లో ప్రతిపాదించింది. రూ.8,814 కోట్లను కేంద్రం కోత విధించడంతో ఈ ఏడాది రూ.45,156 కోట్లు మాత్రమే అప్పుల ద్వారా సమీకరించుకోవాల్సి ఉంటుంది. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో తీసుకునే అప్పుల్లో ప్రతి ఏటా రూ.8,814 కోట్లు కోత పడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.