ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది.
విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ లేఖ రాశారు.
ఇదీ చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష