సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు పీవీ నరసింహారావు స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. డిసెంబర్లో జరిగే పర్యటనలో భాగంగా హైదరాబాద్ రాష్ట్రపతి విడిదిలో పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ లేఖను కేంద్ర న్యాయ & సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఎంపీ నామ నాగేశ్వర్ రావు అందజేశారు.
ఏడాది పొడువునా 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎంపీ నామ అన్నారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ అని ప్రపంచం మెచ్చుకుందని కొనియాడారు. బహుబాషా కోవిదుడు, దేశంలో అనేక సంస్కరణలకు ఆద్యుడు.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తెలంగాణ బిడ్డ.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను నలుమూలలకు పీవీ చాటారని ఎంపీ నామ ప్రశంసించారు.
ఇదీ చూడండి : రాజ్ భవన్ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ