ETV Bharat / state

CCMB Research project: 40 నిమిషాల్లోనే మానవ జన్యు సమాచారం.. సీసీఎంబీ సరికొత్త టూల్‌

ఒక్కో వ్యక్తి పూర్తి జన్యుక్రమాన్ని ఇకపై 40 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అందుకు సంబంధించిన సరికొత్త టూల్‌ను సీసీఎంబీ(CCMB Research project) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్‌ జీనోమ్‌ పరిశోధనలు మరింత వేగం పుంజుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు.

CCMB Research project, ccmb about genetics
సీసీఎంబీ పరిశోధనలు, మానవ జన్యు విశ్లేషణ కోసం సాఫ్ట్‌వేర్
author img

By

Published : Oct 10, 2021, 10:36 AM IST

మానవ జన్యువులను ఇకపై 30 సెకన్లలో విశ్లేషించవచ్చు. ఒక్కో వ్యక్తి పూర్తి జన్యుక్రమాన్ని 40 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఈ మేరకు సరికొత్త టూల్‌(Software for genetics)ను సీసీఎంబీ(CCMB Research project) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరి డీఎన్‌ఏలో 99 శాతం జన్యువులు ఒకేలా ఉంటాయి. ఒక్క శాతమే వేర్వేరుగా ఉంటాయి. ఇవే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మన శరీరంలో ప్రతి కణంలోని మధ్యభాగంలో మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్‌ఏ(DNA) ఉంటుంది. ఇది ఏ, టీ, జీ, సీ అణువుల (Molecules)తో తయారై ఉంటుంది. మన జన్యు సమాచారం వీటి అమరికపైనే ఆధారపడి ఉంటుంది. వాటిలో కొన్ని అమరికలు వరసగా పునరావృతమవుతుంటాయి. వీటినే శాస్త్రీయ భాషలో టాండమ్‌ రిపీట్స్‌గా వ్యవహరిస్తారు. వాటిలో పునరావృతమయ్యే కాంబినేషన్లు 5 వేల వరకు ఉంటాయని అంచనా.

మానవ జీనోమ్‌ పెద్దది కావడంతో వీటిని కంప్యూటర్‌పై విశ్లేషించినా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీసీఎంబీలోని జన్యు పరిశోధకులు అక్షయ్‌కుమార్‌ అవ్వారు, రాకేశ్‌ మిశ్ర, దివ్యతేజ్‌ సౌపతి.. సాధారణ అంకగణితం ఆధారంగా ‘డీడీఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌’ టూల్‌ను అభివృద్ధి(CCMB Research project)) చేశారు. దీని సాయంతో పునరావృతమయ్యే కాంబినేషన్లను ఇట్టే గుర్తించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్‌ జీనోమ్‌ పరిశోధనలు మరింత వేగం పుంజుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. తాజాగా ఈ పరిశోధన ‘బయో-ఆర్కైవ్‌’లో ప్రచురితమైంది.

ఇదీ చదవండి: Bathukamma Festival: ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'.. ప్రత్యేకతలు ఏంటంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.