రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇరువురు మృతి చెందగా, ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు రోడ్డు పక్కన వున్న కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు గాయపడ్డారు. కారులో మైనర్ బాలురు వున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా వాసిగా గుర్తించారు. కుటుంబమంతా బండిపై వెళ్తుండగా హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి : సమ్మెకు ప్రభుత్వమే కారణం: అశ్వత్థామరెడ్డి