ETV Bharat / state

భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం... రేపే విడుదల

రేపు భాజపా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఇప్పటికే గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ఈనెల 27,28,29 తేదీల్లో యూపీ సీఎం, భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి ప్రముఖులు హైదరాబాద్​కు రానున్నారు.

The BJP will release the GHMC election manifesto tomorrow
రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న భాజపా
author img

By

Published : Nov 25, 2020, 12:16 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలను భాజపా మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. రేపు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా జాతీయస్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేయనుండగా.. ప్రచారాన్ని కమలనాథులు మరింత వేడెక్కిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు జాతీయస్థాయి నేతలు గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొంటుండగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచార క్షేత్రంలో దిగనున్నారు.

ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ రానున్నారు. పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 28న ఎన్నికల ప్రచారంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షోలో పాల్గొనడంతో పాటు మేధావుల సమావేశాల్లో పాల్గొంటారు. ఈనెల 29న హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షోలు నిర్వహిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.