ETV Bharat / state

కేసీఆర్​ గవర్నర్​కు క్షమాపణలు చెప్పాలి: భాజపా మహిళా మోర్చా - గవర్నర్​ తమిళిసై

హైదరాబాద్​ గన్​పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు భాజపా మహిళా మోర్చా ఆందోళన నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్​పై తెరాస నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కార్యక్రమం చేపట్టింది.

The BJP Mahila Morcha organized agitation in front of the Gun Park
'కేసీఆర్, ఎమ్మెల్యే సైదిరెడ్డి​ గవర్నర్​కు క్షమాపణలు చెప్పాలి'
author img

By

Published : Aug 20, 2020, 5:11 PM IST

రాష్ట్ర గవర్నర్​పై తెరాస నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా హైదరాబాద్​ గన్​పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు భాజపా మహిళా మోర్చా ఆందోళన నిర్వహించింది. హుజూర్​నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్​కు క్షమాపణ చెప్పాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాపి చెందకుండా ప్రజలను కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలలో తన తప్పిదాలను గుర్తించకుండా... గవర్నర్​పై తెరాస నాయకులు భాజాపా రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోందని మాట్లాడటం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న ప్రభుత్వం... గవర్నర్​కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. తక్షణమే వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని గీతా మూర్తి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.