వలస కార్మికులు, కూలీలకు భోజనంతో పాటు రవాణా తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సమయం ఇవ్వకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల వలస కార్మికులు, రోజువారి కూలీలు, పేదలు తిండితో పాటు ఇతర సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
భోజన ఏర్పాట్లు ఆర్థిక సాయంతో పాటు సొంతూళ్లకు వెళ్లే కూలీలకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని తమ్మినేని కోరారు. మొదటి దశ కొవిడ్ లాక్‌డౌన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆకస్మికంగా 10 రోజులు లాక్‌డౌన్ ప్రకటించడాన్ని సీపీఎం సమర్థించదని అన్నారు. వలస కూలీలు, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్