ప్రభుత్వ పాఠశాలల్లో 306 ఎస్జీటీ ఉద్యోగాల నియామక ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. హిందీ, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ మాధ్యమాలకు ఎస్జీటీ నియామక షెడ్యూలును ప్రకటించింది. టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించింది. ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో ఈనెల 5 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 5న మాధ్యమాల వారీగా అభ్యర్థుల జాబితాను, 6న ఖాళీలను నోటీసు బోర్డు, జిల్లా వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు.
ఈనెల 8న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 9న ఎంపికైన అభ్యర్థులు పాఠశాలల్లో చేరుతారు. కౌన్సెలింగ్కు హాజరుకాని అభ్యర్థులకు 14న వారి చిరునామాలకు నియామక ఉత్తర్వులను పంపిస్తారు. ఈనెల 17న నియామక ప్రక్రియ పూర్తి వివరాలను డీఈవోలు పాఠశాల విద్యాశాఖకు, టీఎస్పీఎస్కి సమాచారం అందజేయనున్నారు.
ఇదీ చూడండి : మూడు గదుల్లో 600 మందికి విద్యాబోధన