ETV Bharat / state

నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ ?

కేబినెట్ కూర్పులో పాలమూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. మహబూబ్​నగర్ ఎమ్మెల్యే  శ్రీనివాస్ గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నిరంజన్ రెడ్డి
author img

By

Published : Feb 19, 2019, 6:36 AM IST

Updated : Feb 19, 2019, 7:51 AM IST

ఆర్థిక మంత్రి నిరంజన్ !
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ కూర్పులో పాలమూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి శాసనసభ్యులు నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నుంచి ఇద్దరికి ఫోన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన నిరంజన్ రెడ్డికి ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కుతుందని మొదటి నుంచే ప్రచారంలో ఉంది. అనుకున్నట్లుగా ఆయనకు మంత్రివర్గంలో పేరు ఖరారైంది. 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీచేసి ఓటమిపాలైన నిరంజన్ రెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి విజయం సాధించడంతో ఆయన పేరే తొలి నుంచి వినబడుతోంది. ఆయనకు కీలక శాఖనే అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ శాసనసభ్యులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రిపదవి వరించింది. 2014లోనే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన సామాజిక, రాజకీయ సమీకరణాల కారణంగా పదవి దక్కలేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే శ్రీనివాస్ గౌడ్ కీలక పదవిలో ఉంటారని ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ముందుగానే ప్రకటించడం కలిసొచ్చింది.
undefined

Intro:Tg_mbnr_07_18_Govt_college_pendingwork_pkg_C12
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు పట్టణం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ శాశ్వత భవనం సమకూరని దుస్థితి కొనసాగుతుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను నిర్వహిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఈ ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంజూరైన సొంత భవనం నిర్మాణ పనులు తీరు మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి.

Body:ఆత్మకూరు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో చేపట్టిన డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు ఆదినుంచే అవంతరాలు ప్రారంభమయ్యాయి. స్థల వివాదం నిధుల మంజూరులో జాప్యం విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 2014లో ప్రారంభమైన భవన నిర్మాణ పనులను పూర్తి చేసిన కళాశాల నిర్వహణకు అవసరమైన గదులు లేక పోవడంతో రెండేళ్లపాటు భవనం నిరుపయోగంగా ఉండిపోయింది. 2017 లో మంజూరైన మరో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రావడంలేదు. ప్రభుత్వ స్థలం నాలుగు ఎకరాలు ఉండగా అవసరమైన మరో ఎకరా స్థలాన్ని జలంధర్ రెడ్డి అనే రైతు సమకూర్చారు. స్థలాన్ని స్వాధీనపరచుకునే సందర్భంగా విరాళంగా ఇచ్చిన ఎకరా స్థలం కాకుండా అదనంగా కొంత స్థలాన్ని ఆక్రమించారని అభ్యంతరాలతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం నెలకొంది. అప్పట్లో ఈ భవనానికి నిర్మాణానికి రూ.కోటి నిధులు సమకూరాయి ఎట్టకేలకు 6 గదుల డిగ్రీ కళాశాల భవనాన్ని జులై 16న 2016 ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ భవనంలో కళాశాలను నిర్వహించేందుకు అవసరమైన మేరకు గదులు లేని పరిస్థితుల్లో ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోనే డిగ్రీ కళాశాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవనంలోకి తరలించడంలో సమస్యల దృశ్య అదనంగా 5తరగతి గదులతోపాటు కార్యాలయం కంప్యూటర్ విభాగం ప్రయోగశాల నిర్మాణం పనులను ప్రతిపాదించారు. ఉన్నతాధికారులు తరగతి గదిలో 5 తరగతి గదుల నిర్మాణానికి రూపాయలు యాభై లక్షలు కంప్యూటర్ గదుల నిర్మాణానికి 12. 50 లక్షల నిధులు మంజూరు చేశారు రెండో విడత నిధులతో చేపట్టిన నిర్మాణాలు పనులు లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరగడం లేదన్న కారణంతో గుత్తేదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వ్యవహరిస్తున్నారు. కళాశాల అధ్యాపక సిబ్బంది అనేకమార్లు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల 8 గ్రూపులకు చెందిన 339 డిగ్రీ కళాశాల విద్యార్థులకు మాత్రం పాట్లు తప్పడం లేదు. కళాశాల భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుండడం వల్ల భవన నిర్మాణం దగ్గర కొంతమంది అసంఘటిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Conclusion: పట్టణానికి దూరంగా ఉన్న కొత్త భవనం అసంపూర్తి పనులు పూర్తి చేసి భవనాన్ని స్వాధీన పరిస్థితి పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు కోరుతున్నారు.
Last Updated : Feb 19, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.