ETV Bharat / state

ప్రియుడి మోజులో పడి - husband

హైదరాబాద్ అంబర్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి మోజులో పడి భర్తనే హత్యచేయించింది ఓభార్య.

దారుణ హత్య
author img

By

Published : Feb 15, 2019, 6:14 AM IST

Updated : Feb 16, 2019, 11:16 AM IST

దారుణ హత్య
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​ అంబర్​పేటకు చెందిన దివ్యాంగుడు చంద్రశేఖర్, వరలక్ష్మి భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. సుల్తాన్​బజార్​ ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకట్​రామ్​రెడ్డి, వరలక్ష్మితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన చంద్రశేఖర్ భార్యను హెచ్చరించాడు.
undefined

తమ బంధానికి అడ్డువస్తున్నాడని భావించిన వారిద్దరు.. చంద్రశేఖర్​ హత్యకు పథకం రచించారు. ఈ పనికి వెంకట్​రామ్​రెడ్డి​ తన మేనమామ కొడుకు నరేశ్​రెడ్డి సహాయం కోరాడు. గుప్తనిధుల వేట అలవాటు ఉన్న చంద్రశేఖర్​ను వెంకట్​రామ్​రెడ్డి, నరేశ్​రెడ్డి గత నెల 13న మంచాల ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు మద్యం సేవించిన అనంతరం చంద్రశేఖర్​ను హతమార్చి అక్కడే పూడ్చిపెట్టారు. పథకం ప్రకారం గత నెల 22న వరలక్ష్మి తన భర్త అదృశ్యమయ్యాడని అంబర్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కాల్​ డేటా పరిశీలించగా వరలక్ష్మి, వెంకట్​రామ్​రెడ్డి మధ్య ఎక్కువసార్లు సంభాషణ జరిగినట్లు గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. మంచాలలో శవాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Intro:పరిహారం చెల్లించాలని నిర్వాసిత రైతుల ఆందోళన

Body:మనుగూరు ఉపరితల గని ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ గని ఆవరణలో రైతులు పనులు అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2014లో గని ఏర్పాటుకు రెవెన్యూ శాఖ రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని సింగరేణి అప్పగించిందని వాపోయారు అప్పటి నుంచి నేటి వరకు పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు పనులు అడ్డుకొని ఆందోళన చేస్తే అధికారులు మాయమాటలు చెప్పి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు జిల్లా ఉన్నతాధికారులు కలిసిన రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:పరిహారం చెల్లించే ఎంతవరకు గని నుంచి కదిలేది లేదని రైతులు టెంటు వేసి వంటలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు రైతులు ఆందోళన రెవెన్యూ అధికారులు వచ్చి రైతులతో ఆందోళన విరమించాలని కోరుతున్నారు.
Last Updated : Feb 16, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.