పాలిటెక్నిక్ డిప్లొమా కోర్లుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2019 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 320 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష... ఒంటి గంటకు ముగిసింది. దాదాపు 1,06,380 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం నిబంధన ఉండడం వల్ల విద్యార్థులు ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
ఇదీ చదవండి : దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన