ETV Bharat / state

'పాఠశాల విద్యార్థులకు ఈనెల 27 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు'

Textbooks: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఈనెల 27 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల డైరెక్టర్ శ్రీనివాసచారి పేర్కొన్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని చెప్పారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో ఉండేవిధంగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు.

పాఠ్యపుస్తకాలు
పాఠ్యపుస్తకాలు
author img

By

Published : Jun 24, 2022, 9:18 PM IST

Textbooks: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఈనెల 27 నుంచి బహిరంగ మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల్లో చాప్టర్ల వారీగా క్యూఆర్ కోడ్ ప్రచురించామని చెప్పారు. తద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాఠాన్ని ఆడియో, వీడియో రూపంలో ఉండేవిధంగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

కాగిత ధర, టెండర్లు ఖరారు చేయడంలో ఆలస్యం కావడంతో ఈపరిస్థితి నెలకొందని తెలిపారు. తద్వారా బడుల ప్రారంభమై 15 రోజులైనప్పటికీ పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ, విక్రయాల కాంట్రాక్టును 13 ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు తెలియచేశారు. జిల్లా విద్యాధికారి నుంచి అనుమతి పొందిన విక్రయ కేంద్రాల్లో ఈనెల 27 నుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధర వసూలు చేస్తే డీఈఓలకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పాఠ్యపుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్, గైడ్లు, వర్క్ బుక్​లు, ఇతర స్టేషనరీ కచ్చితంగా కొనాలని ఒత్తిడి చేసేవారిపై.. చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ శ్రీనివాసచారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'ఇంటర్‌ విద్యార్థులకు 100 శాతం సిలబస్‌'

రాహుల్ గాంధీ ఆఫీస్​పై దాడి.. ఒకేసారి 100 మంది కలిసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.