Tenth Exam fee dates : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ నెల 29 వరకు విద్యార్థులు పాఠాశాల్లో ఫీజు చెల్లించాలని డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. విద్యార్థులు చెల్లించిన ఫీజును ఈ నెల 31 వరకు ప్రదానోపాధ్యాయులు ట్రెజరీకి బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఆలస్య రుసుములతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.
ఆలస్య రుసుము రూ.50తో ఫిబ్రవరి 10.., రూ.200తో ఫిబ్రవరి 21.. రూ.500తో మార్చి 3 వరకు చెల్లించవచ్చునని డైరెక్టర్ తెలిపారు. పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి.
ఇదీ చదవండి: Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల