ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుమలలో పది అడుగుల కొండ చిలువను స్థానికులు గుర్తించారు. కల్యాణ వేదిక వద్ద రహదారికిపైకి వస్తున్న దాన్ని గుర్తించిన జనం... పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పడ్డటంలో నేర్పరి అయిన బాబు.. చాకచక్యంగా దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. జన సంచారం తక్కువగా ఉండటం వల్ల తరచూ అటవీ జంతువులు, పాములు రహదారులపైకి వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: తొర్రూరులో లక్ష విత్తన బంతుల తయారీ