రాష్ట్రంలో రోజురోజుకూ చలితీవ్రత పెరిగిపోతోంది. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు వణికిపోతున్నారు. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ శీతాకాలం ఇప్పటివరకూ చలితీవ్రత పెద్దగా లేకపోగా.. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటంతో రాబోయే రెండు రోజుల్లో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
భాగ్యనగరాన్ని వణికిస్తోన్న చలి
హైదరాబాద్‌లో చలితీవ్రత అమాంతం పెరగటంతో దుకాణసముదాయాలు త్వరగానే మూతపడుతున్నాయి. రాత్రి 10 దాటిన తర్వాత చాలా వరకు రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. పెరిగిన చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: