రాష్ట్రంలోమళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 6 డిగ్రీలు తక్కువుగా పలు జిల్లాలో నమోదైంది. గురువారం తెల్లవారుజామున మెదక్, ఆదిలాబాద్లో అత్యల్పంగా 14 డిగ్రీలు, రామగుండంలో 16, హన్మకొండలో 17, నిజామాబాద్, హైదరాబాద్లో 18 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. గురువారం భద్రాచలంలో 36.6, హైదరాబాద్లో 35.6, ఖమ్మం, నల్గొండలో 36.4 డిగ్రీలఉష్ణోగ్రత నమోదైంది. శ్రీలంక సమీపంలోని కొమరీన్ ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినందున ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
ఇవీ చదవండి:ఎవరిచ్చారు?