ETV Bharat / state

నెల్లూరులో మర్డర్​, చెన్నైలో డెడ్​ బాడీ - మృతదేహంతో ట్రైన్​లో తండ్రీకుమార్తెల జర్నీ - OLD WOMAN MURDER IN NELLORE

నగల కోసం వృద్ధురాలిన చంపిన ఓ తండ్రీ, కుమార్తె - మృతదేహాన్ని ముక్కలుగా చేసి సూట్​ కేసులో పార్సిల్​ చేసి ట్రైన్​లో చెన్నై వెళ్లిన నిందితులు

OLD WOMAN DEAD BODY IN SUITCASE
Father and Daughter Killed old Woman for Gold in Nellore (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 9:10 PM IST

Father and Daughter Killed old Woman for Gold in Nellore : బంగారు నగల కోసం తెలిసిన వృద్ధరాలిని నమ్మించి హత్య చేశారు ఓ తండ్రీకుమార్తెలు. ఆపై వృద్ధరాలి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సూట్​ కేసులో సర్దేశారు. ఈ దారుణమైన ఘటన ఏపీలో నెల్లూరు జిల్లాలో జరగగా సంచలనంగా మారింది. తెలిసిన వివరాల ప్రకారం వృద్ధురాలిని నెల్లూరులోనే హత్యచేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. హంతకులు ఇద్దరూ తండ్రి, కుమార్తెగా పోలీసులు గుర్తించారు. బంగారు ఆభరణాలు కోసమే వృద్ధరాలిని హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఏపీలోని నెల్లూరులో కుక్కలగుంట రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన రమణి(65) అనే వృద్దురాలు సోమవారం కూరగాయలు కొనేందుకు వెళ్లి కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యలు, చట్టుపక్కల వారు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తన తల్లి రమణి కనిపించడం లేదంటూ వృద్ధరాలి కుమారుడు పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చెన్నై రైల్వే స్టేషన్ వద్ద సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహాన్ని పట్టుకున్నట్లు నెల్లూరు పోలీసులకు సమచారం వచ్చింది. ఆ మృతదేహం వృద్ధురాలు రమణిదేనని పోలీసులు గుర్తించగా, మృతురాలి కుటుంబసభ్యులతో కలిసి చెన్నైకు వెళ్లారు.

'తన తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు పురుషోత్తం ఫిర్యాదు చేశారు. దీంతో మేం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చెన్నైలో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యం అయినట్లు సమాచారం అందింది. ఈ హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది'- శ్రీనివాసరావు, సీఐ

తెలిసిన వారే దారుణానికి పాల్పడ్డారు : సంతపేటలో వృద్ధురాలు రమణి ఇంటికి సమీపంలో ఉన్న సుబ్రమణ్యం అనే వ్యక్తి, అతడి కుమార్తె దివ్య నివాసం ఉంటున్నారు. వారికి రమణితో పరిచయం ఉండగా నగల కోసం ఆమెను చంపాలనుకున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధరాలిని నమ్మించి ఆమె దగ్గర ఉన్న నగలు, ఉంగరాలు తీసుకుని నెల్లూరులోని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఎక్కడ పడేయాలనే దానిపై చర్చించుకుని ట్రైన్​లో తీసుకుపోయి దూరప్రాంతంలో పడేసేందుకు సూట్​ కేసులో సర్దేశారు. వృద్ధురాలు నగలు కాజేసేందుకు నిందితులు మూడు రోజులుగా పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల కోసం మరో కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

రూ.1,000 కోసం స్నేహితుడి హత్య - శవాన్ని 3 భాగాలుగా నరికి మురుగు కాల్వలో

ప్రియుడితో కలిసి మూడో భర్తను కొట్టిచంపిన భార్య - ఆపై స్పాట్​లో నుంచి మరో ప్రియుడికి ఫోన్​ చేసి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.