Kamal About Amitabh Bachchan Movie : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కాంబోలో వచ్చిన సినిమా కల్కి 2898 AD. చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ కళ్లెదుట కనిపించింది. కమల్ హాసన్ - అమితాబ్ బచ్చన్‌లు కలిసి కల్కి సినిమాతో వెండితెరపై మెప్పించారు. ఈ జోడీని చూసి ఎంజాయ్ చేసిన అభిమానులకు కమల్ ఓ షాకింగ్ న్యూస్ వినిపించారు. గతంలో అమితాబ్‌తో కలిసి పనిచేసిన సినిమా కారణంగా అమితాబ్‌ను తానెంతో ద్వేషించేవాడినని అన్నారు కమల్ హాసన్.
కల్కీ 2898AD ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా కమల్ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రమేశ్ పిప్పీ రూపొందించిన బ్లాక్ బ్లస్టర్ హిట్ షోలే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు. నిజానికి ఆ సినిమాకు కమల్ హాసన్ అసిస్టెంట్ డైరక్టర్ గా మాత్రమే పనిచేశారు.
"షోలే సినిమాను గురించి తెలిసిన చాలా మందికి తెలియని విషయమేమిటంటే, నేను ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశా. షోలే సినిమా చూసిన రాత్రి నాకు నిద్రపట్టలేదు. ముందుగా ఆ సినిమా నాకు నచ్చలేదు. రమేశ్ పిప్పీని ఇంకా చాలా తిట్టుకున్నా. తర్వాత ఆయనతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. షోలే సినిమా చూసిన తర్వాత ఆయనొక గ్రేట్ ఫిల్మ్ మేకర్ అనిపించింది. ఒక టెక్నీషియన్‌గా ఆ సినిమా చూసిన తర్వాత రాత్రి నిద్రపట్టలేదు. అదొక్కటే కాదు అమితాబ్ అలాంటి చాలా సినిమాల్లో నటించారు. నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో నటిస్తానని అనుకోలేదు. ఆయన నా సినిమాల గురించి మంచి విషయాలు మాట్లాడటం నేను ఊహించలేదు. థ్యాంక్యూ అమిత్ జీ" అంటూ కమల్ ప్రశంసించారు.
'షోలే' సినిమాను రమేశ్ పిప్పీ డైరక్ట్ చేశారు. ధర్మేంద్ర, హేమా మాలినీ, జయా బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. 1975ల నాటి ఈ సినిమా గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామంటో ఎంతటి సక్సెస్ సాధించిందో ఊహించగలం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. షోలే తర్వాత గెరాఫ్తార్ (1985), ఖబర్దార్ (1984), హే రామ్ (2000), కల్కి (2898AD)లలో కమల్ - అమితాబ్ లు కలిసి నటించారు.